నేపాల్‌లో జరుగుతున్న Gen Z Protests కారణంగా చిక్కుకున్న తెలుగువారి సమస్యపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నేపాల్‌లోని 12చోట్ల తెలుగు ప్రజలు చిక్కుకున్నారని వెల్లడించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వదేనని భరోసా ఇచ్చారు. విశాఖకు చెందిన 81మంది ప్రస్తుతం ఖాట్మాండు సమీపంలోని హోటల్‌లో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని లోకేష్ చెప్పారు.<br /><br />#NepalProtests #GenZProtests #NaraLokesh #TeluguNews #AsianetNewsTelugu